భారత్-పాక్ క్రికెట్ సిరీస్కు నో పర్మిషన్?

4 Dec, 2015 19:09 IST|Sakshi
భారత్-పాక్ క్రికెట్ సిరీస్కు నో పర్మిషన్?

భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్పై అనిశ్చితి ఏర్పడింది. పాక్తో క్రికెట్ సిరీస్ను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, ఇందుకు అనుమతి ఇవ్వకపోవచ్చని కథనాలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్కు అనుమతివ్వాలన్న బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించే అవకాశముందని బోర్డు వర్గాల సమాచారం. పాక్తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

'ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపింది. అంతేగాక భారత్-పాక్ సిరీస్ ఆరంభంకావడానికి కొద్ది రోజులే సమయముంది. పాక్తో మనోళ్లు క్రికెట్ ఆడేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టయితే.. ఎప్పుడో అనుమతి పొందేవాళ్లం. భారత్-పాక్ సిరీస్ జరుగుతుందని నేను భావించడం లేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్పై సుదీర్ఘ చర్చల అనంతరం తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పలుమార్లు సంప్రదింపులు జరిపి.. ఈ నెల మధ్యలో సిరీస్ ప్రారంభించాలని ప్రతిపాదించారు. అయితే భారత ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు