పాక్‌ ఆడుతోందా... అయితే మేము ఆడం!

15 Apr, 2017 01:13 IST|Sakshi

జొహర్‌ కప్‌ హాకీ టోర్నీకి భారత్‌ దూరం

న్యూఢిల్లీ: మలేసియాలో జరిగే సుల్తాన్‌ ఆఫ్‌ జొహర్‌ కప్‌ హాకీ టోర్నమెంట్‌ నుంచి భారత్‌ వరుసగా రెండో ఏడాది తప్పుకుంది. అండర్‌–21 స్థాయిలో జరిగే ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ జట్టు ఆడుతుండటమే అందుకు కారణం. 2014లో చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌ను ఓడించిన తర్వాత పాక్‌ ఆటగాళ్లు భారత ప్రేక్షకుల వైపు అసభ్యకర సైగలు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా భావించిన హాకీ ఇండియా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

అయితే పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అప్పటి నుంచి పాక్‌ బరిలో నిలిచే టోర్నీలో ఆడరాదని నిర్ణయం తీసుకుంది. ‘సుల్తాన్‌ జొహర్‌ కప్‌ ఆహ్వానిత టోర్నీ మాత్రమే. అందులో పాల్గొనడం తప్పనిసరి కూడా కాదు. కాబట్టి మా గత నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం’ అని హాకీ ఇండియా ప్రతినిధి ఆర్పీ సింగ్‌ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు