భారత్‌ ర్యాంక్‌ 135

23 Dec, 2016 00:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 135వ స్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్‌. గురువారం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) జట్ల ర్యాంకులను విడుదల చేసింది.

ఆటగాళ్ల ఉత్తమ రాణింపుతోనే ఇది సాధ్యమైందని కోచ్‌ స్టీఫెన్‌ కాన్‌స్టాంటైన్‌ తెలిపారు. ఈ ఏడాది భారత జట్టు శాఫ్‌ చాంపియన్‌షిప్‌తో పాటు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఉత్తమ ర్యాంకులో ఉన్న ప్యూర్టోరికోను 4–1తో ఓడించింది.

 

మరిన్ని వార్తలు