దులీప్‌ ట్రోఫీ విజేత ఇండియా రెడ్‌

8 Sep, 2019 05:16 IST|Sakshi

అక్షయ్‌ వాఖరే ధాటికి కుప్పకూలిన గ్రీన్‌

ఇన్నింగ్స్, 38 పరుగుల తేడాతో పరాజయం

బెంగళూరు: దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ ఆరంభ టోర్నీ దులీప్‌ ట్రోఫీని ఇండియా రెడ్‌ కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ ముగిసిన ఫైనల్లో ఆ జట్టు ఇన్నింగ్స్‌ 38 పరుగుల తేడాతో ఇండియా గ్రీన్‌పై విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 345/6 తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన రెడ్‌ 388 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నిం గ్స్‌కు దిగిన గ్రీన్‌ను ఆఫ్‌ స్పిన్నర్‌ అక్షయ్‌ వాఖరే (5/13) హడలెత్తించాడు. పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ (3/38) కూడా ఓ చేయి వేయడంతో గ్రీన్‌ 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. సిద్దేశ్‌ లాడ్‌ (80 బంతుల్లో 42; 6 ఫోర్లు), హైదరాబాదీ బ్యా ట్స్‌మన్, ఓపెనర్‌ అక్షత్‌ రెడ్డి (47 బంతుల్లో 33; 7 ఫోర్లు) మాత్రమే కాస్త ప్రతిఘటన కనబర్చారు. అక్షయ్, అవేశ్‌ ధాటికి వీరిద్దరు కాక కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే గాయంతో బ్యాటింగ్‌కు దిగలేదు. రెడ్‌ తరఫున భారీ శతకంతో అదరగొట్టిన ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (153)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

సంక్షిప్త స్కోర్లు
ఇండియా గ్రీన్‌ తొలి ఇన్నింగ్స్‌: 231;
ఇండియా రెడ్‌ తొలి ఇన్నింగ్స్‌: 388 (ఈశ్వరన్‌ 153; అంకిత్‌ రాజ్‌పుత్‌ 3/101, ధర్మేంద్ర జడేజా 3/93),
ఇండియా గ్రీన్‌ రెండో ఇన్నింగ్స్‌: 119 (అక్షత్‌ రెడ్డి 33; అక్షయ్‌ వాఖరే 5/13). 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంగ్లండ్‌ ఇక కష్టమే..!

నాదల్‌ను ఆపతరమా!

అరెస్ట్‌ వారెంట్‌.. షమీ బెయిల్‌ ప్రయత్నాలు

టీ ‘20’ స్థానాలు ఎగబాకాడు..!

ముగాబే మృతిపై ఒలోంగా ఏమన్నాడంటే..?

‘నన్ను చిన్నచూపు చూశారు’

మన టాపార్డర్‌ సూపర్‌ కదా.. అందుకే!: యువీ

దిగ్గజాల సరసన రషీద్‌ ఖాన్‌

వార్నర్‌ రియాక్షన్‌ అదిరింది!

‘మంచి స్నేహితున్ని కోల్పోయాను’

హార్దిక్‌ ‘భారీ’ ప్రాక్టీస్‌

19వ గ్రాండ్‌స్లామ్‌పై గురి

కొడుకు కోసం.. కిక్‌ బాక్సింగ్‌ చాంపియనై..

విజేతలు పద్మశ్రీ, మనో వెంకట్‌

భారత సైక్లింగ్‌ జట్టులో తనిష్క్‌

పాక్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

ఇంగ్లండ్‌ ఎదురీత: ప్రస్తుతం 200/5

మెరిసిన సామ్సన్, శార్దుల్‌

దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు

4 బంతుల్లో 4 వికెట్లు

సెరెనా...ఈసారైనా!

‘ఆ దమ్ము బుమ్రాకే ఉంది’

దిగ్గజ ఫుట్‌బాలర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

నన్ను కావాలనే ఇరికిస్తున్నారు: మునాఫ్‌

‘ఆ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అతనికే సొంతం’

క్రికెటర్‌ నబీ సంచలన నిర్ణయం

ఆమ్లా రికార్డును బ్రేక్‌ చేసిన మహిళా క్రికెటర్‌

‘స్మిత్‌ టెస్టుల్లోనే మేటి.. మరి కోహ్లి అలా కాదు’

కోహ్లిని దాటేశాడు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నయా లుక్‌

రాజకీయ రాణి

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు