భారత్ ఘనవిజయం

4 Sep, 2016 00:34 IST|Sakshi
భారత్ ఘనవిజయం

4-1తో ప్యూర్టోరికో చిత్తు
ముంబై: ‘ఫిఫా’ ర్యాంకింగ్‌‌సలో తమకన్నా ఎంతో మెరుగైన ప్యూర్టోరికోపై భారత ఫుట్‌బాల్ జట్టు అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపుతూ శనివారం స్థానిక అంధేరి స్పోర్‌‌ట్స కాంప్లెక్స్‌లో జరిగిన ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత్ 4-1తో నెగ్గింది. చివరి 11 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది తొమ్మిదో విజయం కావడం విశేషం. నారాయణ్ దాస్ (18వ ని.లో), సునీల్ చెత్రి (26వ ని.లో), జేజే లాల్‌పేఖులా (34వ ని.లో), జాకీచంద్ సింగ్ (58వ ని.లో) ఆతిథ్య జట్టు తరఫున గోల్స్ చేయగా... ప్రత్యర్థి జట్టుకు ఎమ్మాన్యుయల్ సాంచెజ్ (8వ ని.లో) ఏకై క గోల్ చేశాడు.

ఆరు దశాబ్దాల అనంతరం ముంబైలో జరిగిన ఈ అంతర్జాతీయ మ్యాచ్‌లో... ప్రారంభంలోనే గోల్ సమర్పించుకున్నా భారత్ ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదు. 15వ నిమిషంలో జట్టు నుంచి గోల్ వైపు తొలి షాట్ వెళ్లింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే భారత్ ఖాతా తెరిచింది. సునీల్ చెత్రి ఫ్రీ కిక్ గోల్ పోస్టును తాకి బయటికి రాగా నారాయణ్ దాస్ తిరిగి గోల్‌గా మలిచాడు. ఇక అక్కడి నుంచి భారత్ దూకుడు కొనసాగి ప్రథమార్ధంలోనే మరో రెండు గోల్స్ చేసింది. చెత్రి, జేజే చెరో గోల్ చేశారు.  ద్వితీయార్ధంలోనూ భారత్ ఆటతీరులో జోరు తగ్గలేదు. 58వ నిమిషంలో   జాకీచంద్ సింగ్ జట్టుకు నాలుగో గోల్ అందించడంతో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది.

మరిన్ని వార్తలు