టీమిండియా విజయలక్ష్యం : 164 పరుగులు

3 Aug, 2013 16:25 IST|Sakshi
టీమిండియా విజయలక్ష్యం : 164 పరుగులు

బులవాయోలో జరుగుతున్న ఐదో వన్డేలో కేవలం 39.5 ఓవర్లలో జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్ప కూలడంతో ఇండియా ముందు తక్కువ విజయ లక్ష్యం నిలిపింది. భార‌త్ ఓపెన‌ర్ పుజారా ఆదిలోనే చేతులెత్తేశాడు. ధావ‌న్ 21 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్‌)తో 34 ప‌రుగులతో నాటౌట్‌గా రాణిస్తున్నాడు. రెహానా 11 బంతుల్లో ఒక (1 ఫోర్‌) 7 ప‌రుగుల‌తో నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నాడు.  కాగా, 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 1 వికెట్ నష్టానికి భార‌త్ 43 ప‌రుగులు చేసింది.

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన జింబాబ్వే 163 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటింగ్‌ లైనప్‌లో శాన్‌ విలియమ్స్‌ అత్యధికంగా 51 పరుగులు చేశాడు. మసకద్జ 32 పరుగులు చేశాడు. మిగతా వారంతా 17 పరుగుల్లోపు ఔటయ్యారు. భారత బౌలర్లలో అమిత్‌ మిశ్రాకు ఆరు వికెట్లు లభించడం విశేషం.  కాగా జింబాబ్వే బౌల‌ర్ జ‌ర్వీష్ ఒక వికెట్ తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు