21 ఏళ్ల తరువాత తొలిసారి

4 May, 2017 20:40 IST|Sakshi
21 ఏళ్ల తరువాత తొలిసారి

న్యూఢిల్లీ:ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య(ఫిఫా) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ లో భారత జట్టు 100వ ర్యాంకులో నిలిచింది. ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న  భారత్ జట్టు ఒక ర్యాంకు ఎగబాకి వందో ర్యాంకుకు చేరింది.  ఇలా భారత జట్టు వందో ర్యాంకుకు చేరడం 21 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. చివరిసారి 1996 ఏప్రిల్ లో వందో ర్యాంకును సాధించిన భారత్ జట్టు ఆపై ఇంత కాలానికి ఆ మార్కును చేరింది. కాగా, మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చూస్తే ఇప్పటివరకూ భారత జట్టు ఆరుసార్లు మాత్రమే వందో ర్యాంకును చేరింది.


భారత ఫుట్ బాల్ ర్యాంకుపై కోచ్ స్టెఫానీ సంతోషం వ్యక్తం చేశాడు. 'గత కొంతకాలంగా భారత జట్టు  నిలకడగా విజయాలు సాధించడంతో ర్యాంకు కూడా మెరుగుపడింది. మా ముందు పలు ప్రధాన మ్యాచ్ లున్నాయి. వాటిలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. ఏ మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోం. తప్పులకు ఇక్కడ చో్టే లేదు'అని స్టెఫానీ పేర్కొన్నాడు.

 

>
మరిన్ని వార్తలు