శ్రీలంక లక్ష్యం 131 పరుగులు

6 Apr, 2014 20:47 IST|Sakshi
శ్రీలంక లక్ష్యం 131 పరుగులు

మిర్పూర్: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకకు భారత్ 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ 29, యువరాజ్ సింగ్ 11 పరుగులు చేశారు. ఓపెనర్ రహానే(3) నిరాశపరిచాడు. ధోని నాలుగు పరుగులతో నాటౌట్గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, మాథ్యూస్, హిరాత్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.

మరిన్ని వార్తలు