వారెవ్వా.. ధోని!

30 Jun, 2017 23:50 IST|Sakshi
వారెవ్వా.. ధోని!
♦ విండీస్‌ లక్ష్యం 252
♦ రాణించిన రహానే, జాదవ్‌
 
ఆంటిగ్వా: నిలకడలేమి ఫామ్‌తో సతమతవవుతున్న భారత మాజీ కెప్టెన్‌ ధోని మెరిశాడు. మిమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చి జట్టుకు తన అవసరమెంటో మరోసారి గుర్తు చేశాడు. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో క్లిష్ట పరిస్థితిలో అర్ధ సెంచరీ బాది జట్టుకు గౌరవ ప్రదమమై స్కోరు అందించాడు. ఇక సూపర్‌ ఫామ్‌లో ఉన్న అజింక్యా రహానే కూడా రాణించడంతో భారత్‌ విండీస్‌కు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. బౌలింగ్‌ పిచ్‌ కావడంతో బ్యాట్స్‌మెన్‌ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(2), కెప్టెన్‌ కోహ్లీ(11) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
 
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌తో మరో ఓపెనర్‌ రహానే ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జట్టు స్కోరు 100 వద్ద స్పిన్నర్‌ దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో యువరాజ్‌ సింగ్‌ (39: 55 బంతుల్లో 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరకడంతో 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రహానే, ధోనితో కలిసి తన ఫామ్‌ను కొనసాగిస్తూ 89 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 170 వద్ద రహానే (71; 112 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్‌)ను కమిన్స్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక చివర్లో ధోని (78; 79 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు‌), కేదార్‌ జాదవ్‌( (40; 26 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్‌) దాటిగా ఆడటంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఇక విండీస్‌ బౌలర్లలో కమిన్స్‌(2) వికెట్లు తీయగా హోల్డర్‌,బిషూలకు తలా ఓ వికెట్‌ దక్కింది.
మరిన్ని వార్తలు