పసికూనను వదల్లేదు

30 Jun, 2018 09:07 IST|Sakshi
వికెట్‌ తీసిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు

డబ్లిన్: అప్రతిహత విజయాలతో  దూసుకువెళ్తున్న టీమిండియా పసికూన ఐర్లాండ్‌ను వదల్లేదు. చిన్న జట్టని తక్కువ అంచనా వేయకుండా పెద్ద విజయం సాధించింది.   రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్‌ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్‌ షోతో ఆదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐరిష్‌ జట్టుపై రికార్డుల మోత మోగించారు.

*టీ20లో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం(143 పరుగుల భారీ తేడాతో). గతంలో శ్రీలంకపై 93 పరుగుల విజయమే అత్యుతమం.. కాగా ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది.

*ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20లో పరుగుల పరంగా టీమిండియా సాధించినది రెండో అతిపెద్ద విజయం. ఈ జాబితాలో తొలి స్థానంలో శ్రీలంక ఉంది.  2007లో కెన్యాపై జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

*ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా రెచ్చిపోయారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఐరీష్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 70 పరుగులకే ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి జట్టును ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్‌ చేయడం టీమిండియాకిదే తొలిసారి. గతంలో ఇంగ్లండ్‌ను 80 పరుగులకు ఆలౌట్‌ చేసిన రికార్డే ఇప్పటివరకు అత్యుత్తమం.  

మరిన్ని వార్తలు