అఫ్గాన్‌కు ఎక్కువ సీన్‌ ఇచ్చారు: మాజీ క్రికెటర్‌

24 Jun, 2019 16:02 IST|Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్‌ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. అఫ్గాన్‌ను బౌలర్లకు ఎక్కువ సీన్‌ ఇవ్వడంతోనే భారత జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైందంటూ ఎద్దేవా చేశాడు. అఫ్గాన్‌ బౌలర్లు మహ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, రషీద్‌ఖాన్‌ కట్టుదిట్టంగా బంతులేసినా.. భారత్‌ను మరీ 225 పరుగులలోపే కట్టడి చేసేంత ప్రదర్శన కాదని అన్నాడు.

పిచ్‌ సహకరించకలేదని చెప్పుతూనే మధ్య ఓవర్లలో భారత్‌ బ్యాటింగ్‌ మరీ నెమ్మదించడం ఆలోచించాల్సిన విషయమన్నాడు.  స్వేచ్ఛగా షాట్లు ఆడటంలో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ తడబాటుకు లోనైందన్న విషయం అంగీకరించాలన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  అద్భుతంగా వ్యవహరించాడని అతని కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. అఫ్గాన్‌ ఆఖరి వరకూ పోరాడినా టీమిండియా గెలవడం సంతోషాన్నిచ్చిందన్నాడు.


 

మరిన్ని వార్తలు