భారత్‌కు రెండో విజయం

13 Oct, 2016 00:42 IST|Sakshi
భారత్‌కు రెండో విజయం

ప్రపంచకప్ కబడ్డీ టోర్నీ


అహ్మదాబాద్: తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం చవిచూసిన భారత పురుషుల కబడ్డీ జట్టు ప్రపంచ కప్‌లో ఫామ్‌లోకి వచ్చింది. బంగ్లాదేశ్‌తో మంగళ వారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 57-20 తో ఘనవిజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కిది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌లో కొరియా చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఈనెల 15న జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది.

అందరికీ ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో టీమిండియా ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అజయ్ ఠాకూర్ 11 పారుుంట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్ నర్వాల్ ఎనిమిది పారుుంట్లు, సురేందర్ ఆరు పారుుంట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో ఇరాన్ 33-28తో కెన్యాపై గెలిచి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో జపాన్ 33-22తో పోలాండ్‌పై, ఆస్ట్రేలియా 68-45తో అర్జెంటీనాపై గెలిచారుు.

మరిన్ని వార్తలు