మను భాకర్‌ స్వర్ణ సంబరం

23 Nov, 2019 05:52 IST|Sakshi

పుతియాన్‌ (చైనా): షూటింగ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. పోటీల చివరి రోజు శుక్రవారం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు మను భాకర్, సౌరభ్‌ చౌదరీ, షాజర్‌ రిజ్వీ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలిచారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో  దివాన్ష్ సింగ్‌ స్వర్ణం, అపూర్వీ చండేలా రజతం గెల్చుకున్నారు. ఫైనల్లో మను (భారత్‌)–చెర్నూసోవ్‌ (రష్యా) ద్వయం 17–13 పాయింట్లతో సౌరభ్‌ (భారత్‌)–అన్నా కొరాకకీ (గ్రీస్‌) జోడీపై విజయం సాధించింది.  కాంస్య పతకం మ్యాచ్‌లో రిజ్వీ (భారత్‌)–జొరానా (సెర్బియా) జంట 17–15తో వు జియావు (చైనా)–వితాలినా (రష్యా) జోడీపై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో దివాన్ష్ (భారత్‌)–నెజానా (క్రొయేషియా) ద్వయం 16–14తో జాంగ్‌ చాంగ్‌హోంగ్‌ (చైనా)–అపూర్వీ చండేలా (భారత్‌) జంటపై గెలిచి స్వర్ణం గెలిచింది.

మరిన్ని వార్తలు