బ్రిస్బేన్‌ టెస్టుతో మొదలు!

28 May, 2020 00:01 IST|Sakshi

ఆసీస్‌లో భారత్‌ పర్యటన

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత క్రికెట్‌ జట్టు టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబర్‌ 3 నుంచి బ్రిస్బేన్‌ మైదానంలో జరిగే తొలి టెస్టుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభమవుతుందని ఆసీస్‌ మీడియా తెలిపింది. ఈ మేరకు ఆసీస్‌లో భారత్‌ పర్యటన వివరాలను శుక్రవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. బ్రిస్బేన్‌ టెస్టు తర్వాత అడిలైడ్‌లో డిసెంబర్‌ 11 నుంచి రెండో టెస్టు... మెల్‌బోర్న్‌లో డిసెంబర్‌ 26 నుంచి మూడో టెస్టు... సిడ్నీలో జనవరి 3 నుంచి నాలుగో టెస్టు జరుగుతుంది. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టును డే–నైట్‌గా నిర్వహించే అవకాశముంది. కరోనా నేపథ్యంలో ఆసీస్‌లో పర్యటించే భారత జట్టును క్వారంటైన్‌లో పెట్టాలా వద్దా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు