ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

10 Sep, 2017 01:21 IST|Sakshi
ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

బిజీ షెడ్యూల్‌పై టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అసంతృప్తి
ముంబై: దాదాపు రెండు నెలలపాటు సాగిన శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్‌ జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి20 ఆడి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ పర్యటన అనంతరం జట్టు తగిన విశ్రాంతి తీసుకోవడం లేదు. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 13 వరకు ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా... ఈ సిరీస్‌ ముగిసిన నాలుగు రోజులకే నవంబర్‌ 7 వరకు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇక్కడైనా ఆగారా అంటే అదీ లేదు. కివీస్‌తో సిరీస్‌ ముగిసిన వారం రోజుల అనంతరం భారత్‌కు రానున్న శ్రీలంక జట్టుతో డిసెంబర్‌ 24 వరకు వన్డే సిరీస్‌ ఉంటుంది. లంకతో సిరీస్‌ ముగిసిన నాలుగు రోజుల తర్వాత డిసెంబర్‌ 28న దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లి సేన వెళ్లాల్సి ఉంటుంది. ఇక అక్కడ మూడు టి20, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడాక స్వదేశానికి వస్తుంది.  

మా అభిప్రాయాలు తీసుకోండి...
అలుపెరగని రీతిలో ఉన్న భారత బిజీ షెడ్యూల్‌పై సహజంగానే జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌ సిరీస్‌లు ఉండటం జట్టుకు చేటు తెస్తుందని అన్నారు. ఇదే విషయమై ఆయన పరిపాలకుల కమిటీ (సీఓఏ)తో వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా చర్చించారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తమ ఆటగాళ్లకు ఏవిధంగా విశ్రాంతినిచ్చి కాపాడుకుంటున్నాయో వివరించారు.

వారికి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా క్రిస్‌మస్‌ బ్రేక్‌ కింద స్వదేశానికి వచ్చేలా వెసులుబాటు ఉంటుందని గుర్తుచేశారు. ఇప్పుడు భారత జట్టు కివీస్‌తో ఆడే వన్డే సిరీస్‌ దీపావళి సమయంలోనే ఉంటుంది. కానీ మన ఆటగాళ్లకు వారి ఇళ్లకు వెళ్లి వచ్చే వీలుండదు. అయితే ప్రస్తుత పరిస్థితిలో షెడ్యూల్‌పై ఏమీ చేయలేమని బోర్డు అశక్తత వ్యక్తం చేసింది. కనీసం భవిష్యత్‌లోనైనా టూర్ల షెడ్యూల్‌ సమయంలో కెప్టెన్, కోచ్‌ల అభిప్రాయాలను తీసుకోవాలని శాస్త్రి బీసీసీఐకి సూచించారు.  

శాస్త్రి సూచనలను పరిగణిస్తాం...
మరోవైపు రవిశాస్త్రి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి తెలిపారు. ‘ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ క్యాలెండర్‌ విరామం లేకుండా ఉంటోంది. మ్యాచ్‌లతో పాటు సుదీర్ఘ విమాన ప్రయాణాలతో ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోతుంటారు. ఈ విషయంపై ఆలోచించాలని శాస్త్రి మాతో చెప్పారు. విరామం ఉంటే ఆటగాళ్లు వేగంగా కోలుకుంటారన్నారు. ఇంగ్లండ్, ఆసీస్‌ జట్లు తమ సిరీస్‌ల మధ్య తగిన విరామం ఉండేలా చూసుకుంటారు. ఇలాగే బీసీసీఐ కూడా ఇదే విధంగా ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడు ఆటగాళ్ల సంక్షేమాన్ని కూడా పట్టించుకున్నట్టవుతుంది’ అని జోహ్రి అన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

సెమీస్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ జట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!