తొలిటెస్టు : సెంచరీ చేజార్చుకున్న రహానే

15 Nov, 2019 15:04 IST|Sakshi

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానే (172 బంతుల్లో 86; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక సెంచరీతో జట్టును ముందుండి నడిపిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌ (271 బంతుల్లో 170; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నాడు. ఇది మయాంక్‌కు మూడో టెస్టు సెంచరీ.  నాలుగో వికెట్‌గా రహానే వెనుదిరిగిన అనంతరం ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా క్రీజులోకొచ్చాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం 177 పరుగుల ఆదిక్యంలో కొనసాగుతోంది. టీమిండియా ఆటగాళ్ల నాలుగు వికెట్లు అబు జాయేద్‌ తీయడం విశేషం. టెస్టుల్లో జాయేద్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం మరో విశేషం. బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
(చదవండి : రహానే అరుదైన ఘనత)

తొలి రోజు టీ విరామం తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ ముగియడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కాగా, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(6) నిరాశపరిచాడు. మరో ఓపెనర్‌ చతేశ్వర్‌ పుజారా మయాంక్‌తో కలిసి ఇన్నింగ్స్‌కు మరమ్మత్తులు చేపట్టాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. చతేశ్వర్‌ పుజారా (54) హాఫ్‌ సెంచరీ సాధించి రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. పుజారా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(0) విఫలమయ్యాడు. తాను ఆడిన రెండో బంతికి అతను డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇదిలాఉండగా.. టెస్టు ఫార్మాట్‌లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్న 16వ భారత ఆటగాడిగా రహానే రికార్డు సాధించాడు. 104 ఇన్నింగ్స్‌ల్లో రహానే నాలుగు వేల పరుగుల మార్కును చేరుకున్నాడు.
(చదవండి : మయాంక్‌ మళ్లీ బాదేశాడు..)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు