తొలి టెస్టు : భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా

15 Nov, 2019 17:29 IST|Sakshi

343 పరుగుల ఆదిక్యంతో టీమిండియా

రెండోరోజు ఆట ముగిసే సమయానికి 493/6 వద్ద భారత్‌

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు టీమిండియా 493/6 తో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో టీమిండియా ఆట ముగిసే సమయానికి 343 పరుగుల ఆదిక్యం సాధించింది. రవీంద్ర జడేజా (76 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉమేష్‌ యాదవ్‌ (10 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు. అబు జాయేద్‌ 4, ఎబాదత్‌ హొసేన్‌, మెహిదీ హసన్‌ తలో వికెట్‌ తీశారు. ఇక 86/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఈరోజు ఆటను మయాంక్‌ అగర్వాల్‌-చతేశ్వర్‌ పుజారా ఆరంభించి 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 
(చదవండి : డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌)

ఈ క్రమంలోనే చతేశ్వర పుజారా(54) హాఫ్‌ సెంచరీ తర్వాత రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(0) విఫలమయ్యాడు. తాను ఆడిన రెండో బంతికి కోహ్లి డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకొచ్చిన రహానే మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి మంచి భాగస్వామాన్ని నమోదు చేశాడు. ఈక్రమంలో మయాంక్‌ సెంచరీ సాధించగా.. రహానే (172 బంతుల్లో 86; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం ఆదే ఊపుతో చెలరేగి ఆడిన మయాంక్‌ డబుల్‌ సెంచరీ తర్వాత.. జట్టు స్కోరు 432 వద్ద (330 బంతుల్లో 243; 28 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. 11 బంతుల్లో 12 (2 ఫోర్లు) పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.
(చదవండి : తొలిటెస్టు : సెంచరీ చేజార్చుకున్న రహానే)

మరిన్ని వార్తలు