ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

8 Feb, 2020 07:13 IST|Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించాడు. తొలి వన్డేలో 347 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్‌ వైఫల్యాలు ఇక్కడ స్పష్టంగా కనిపించాయి. టి20 సిరీస్‌లో ఘన విజయం తర్వాత జట్టు ఉదాసీనత ప్రదర్శించినట్లు గత మ్యాచ్‌లో అనిపించింది. ఇప్పుడు ఆ పరాజయాన్ని మరచి కొత్త వ్యూహంతో బరిలోకి దిగాల్సిన సమయం వచ్చింది.

తుది జట్ల వివరాలు:
భారత్‌: కోహ్లి(కెప్టెన్),  పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్,  శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్‌ కీపర్‌), జాదవ్, జడేజా, ఠాకూర్, సైని, బుమ్రా, చాహల్
న్యూజిలాండ్‌: లాథమ్ (కెప్టెన్, వికెట్‌ కీపర్‌), నికోలస్‌, గప్టిల్, చాప్మన్, బ్లండెల్, టేలర్, నీషామ్, డి గ్రాండ్‌హోమ్, సౌతీ, జామిసన్, బెన్నెట్

పిచ్, వాతావరణం 
ఇలా బ్యాట్‌కు బంతి తగలడమే ఆలస్యం అలా బౌండరీ దాటడం ఈడెన్‌ పార్క్‌లో సహజం. ప్రపంచంలో అతి చిన్న మైదానాల్లో ఇదొకటి. పరుగుల వరదతో భారీ స్కోర్లు ఖాయం. ఈ పర్యటనలో తొలి రెండు టి20లు ఇక్కడే జరిగాయి. ఛేదన సులువు కాబట్టి టాస్‌ కీలకం కానుంది. మ్యాచ్‌ రోజు వర్షం ముప్పు లేదు.

మరిన్ని వార్తలు