మళ్లీ వర్షం పడితే టీమిండియా ఆప్షన్స్‌ ఇవే..

10 Jul, 2019 14:48 IST|Sakshi

మాంచెస్టర్: వాతావరణం అనుకూలించక మ్యాచ్‌కు అంతరాయం కలిగినప్పుడు ప్రత్యర్థి జట్టు టార్గెట్ స్కోర్‌ను నిర్ణయించడానికి అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరిస్తుంటారు. టీమిండియాతో జరుగుతున్న వరల్డ్‌కప్ సెమీస్ ఫైనల్లో భాగంగా  న్యూజిలాండ్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద ఉన్న తరుణంలో వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  అయితే పదే పదే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించడంతో మంగళవారం నాడు జరగాల్సిన మ్యాచ్‌.. రిజర్వ్‌ డే అయిన బుధవారానికి మారింది. మ్యాచ్‌ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ్నుంచీ కొనసాగించనున్నారు. కాగా, ఈ మ్యాచ్‌ను నేడు కూడా వరుణుడు వెంటాడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే.. వర్షం ప్రభావంతో ఓవర్లను కుదించి మ్యాచ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం జరిగితే లక్ష్య సాధనలో టీమిండియా చేయాల్సిన పరుగులివే. అయితే న్యూజిలాండ్‌ ఈరోజు బ్యాటింగ్‌ చేయని పక్షంలోనే ఈ విధానం వర్తిస్తుంది.(ఇక్కడ చదవండి: మళ్లీ వర్షం రావడమే మంచిదైంది)

డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా చేయాల్సిన పరుగులు

    46ఓవర్లకు మ్యాచ్ జరిగితే 237 పరుగులు
    40ఓవర్లకు మ్యాచ్ జరిగితే 223 పరుగులు
    35 ఓవర్లకు మ్యాచ్ జరిగితే 209 పరుగులు
    30 ఓవర్లకు మ్యాచ్ జరిగితే 192 పరుగులు
    25 ఓవర్లకు మ్యాచ్ జరిగితే 172 పరుగులు
    20 ఓవర్లకు మ్యాచ్ జరిగితే 148 పరుగులు
అది సాధ్యం కాకపోతే లీగ్‌ దశలో టాప్‌లో ఉన్న భారత్‌ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది

మరిన్ని వార్తలు