కోహ్లి మరోసారి విఫలం

29 Feb, 2020 08:22 IST|Sakshi

క్రైస్ట్‌చర్చి : హెగ్లే ఓవల్‌ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. పుజార, హనుమ విహారిలు అర్థశతకాలు చేయడంతో  టీ విరామం సమయానికి భారత్‌ 53.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. చటేశ్వర్‌ పుజారా 53 పరుగులుతో ఆడుతున్నాడు. అయితే హనుమ విహారి 55 పరుగులు చేసి ఔట్‌ కావడంతో బారత్‌ 5వ వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు టాస్‌ గెలిచిన కివీస్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాలు ఆరంభంలో ఆచుతూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు.

జట్టు స్కోరు 30 పరుగులు ఉన్నప్పుడు మయాంక్‌ 7 పరుగులు చేసి బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారతో కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా వన్డే తరహాలో ఇన్నింగ్స్‌ ఆడి 8పోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 54 పరుగులు చేసి జేమిసన్‌ బౌలింగ్‌లో టామ్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో 80 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లితో కలిసి పుజార మరో వికెట్‌ పడకుండా 85 పరుగుల వద్ద లంచ్‌కు వెళ్లింది.

లంచ్‌ విరామమనంతరం విరాట్‌ కోహ్లి తన పేలవ ఫామ్‌ను మరోసారి కొనసాగిస్తూ సౌథీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో భారత్‌ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే 7 పరుగులు చేసి ఔటవ్వడంతో 113 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2, బౌల్ట్‌, జేమిసన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. కాగా గాయంతో రెండో టెస్టుకు దూరమైన ఇషాంత్‌ స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ ,రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో జడేజా టీమిండియా తుది జట్టులోకి రాగా, కివీస్‌ ఏ మార్పు లేకుండానే బరిలోకి దిగింది.

మరిన్ని వార్తలు