రోహిత్‌కు అవకాశం ఇవ్వని కోహ్లి 

22 Aug, 2019 19:43 IST|Sakshi

నార్త్‌సౌండ్‌ (అంటిగ్వా) : కేవలం పరిమిత ఓవర్ల క్రికెటర్‌గా ఉన్న అపవాదును తొలగించుకోవాలనుకున్న టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు మరోసారి నిరాశే ఎదురైంది. అందరూ ఊహించనట్టే తొలి టెస్టులో ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు అవకాశం దక్కలేదు. స్థానిక సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గురువారం ఉదయం వర్షం పడటంతో అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిచిత్తడిగా మారింది. దీంతో అంపైర్లు టాస్‌ను ఆలస్యంగా వేశారు. 

వెస్టిండీస్‌తో తెలి టెస్టుకు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు అవకాశం కల్పిస్తారని అందరూ భావించినప్పటికీ కోహ్లి అతడిని పక్కకు పెట్టాడు. మరొక సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలి సారి జట్టుకు ఎంపికైన రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు నిరాశ తప్పలేదు. ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లకు అవకాశం కల్పించాడు. గత సిరీస్‌లో రాణించిన తెలుగు కుర్రాడు హనుమ విహారిపై కోహ్లి మరోసారి నమ్మకం పెట్టుకున్నాడు. ఇక వెస్టిండీస్‌ తరుపున బ్రూక్స్‌ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. 

తుదిజట్లు:
భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, చటేశ్వర పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, జస్ప్రిత్‌ బుమ్రా
వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్, కాంప్‌బెల్, హోప్, డారెన్‌ బ్రేవో, హెట్‌మైర్, చేజ్, బ్రూక్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), కమిన్స్‌, రోచ్, గాబ్రియెల్‌.      
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా