మొదటి వన్డేకు వర్షం అడ్డంకి

8 Aug, 2019 19:22 IST|Sakshi

ప్రావిడెన్స్‌ (గయానా): టీమిండియా, వెస్టిండీస్‌ మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కురవడంతో మ్యాచ్‌ ఆలస్యమైంది. పిచ్‌ తడిగా ఉండటంతో ఇంకా టాస్‌ వేయలేదు. మైదానాన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మళ్లీ వాన రాకుండా ఉంటే మ్యాచ్‌ జరిగే అవకాశముంది. వర్షం తగ్గి మ్యాచ్‌ జరగాలని మైదానానికి విచ్చేసిన ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వర్షం కాస్త తెరిపివ్వడంతో పిచ్‌పై కప్పిన కవర్లను సిబ్బంది తొలగిస్తున్నారు.  
 
టి20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా జోరు మీద ఉంది. మూడు వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ సిరీస్‌ నెగ్గి తమ దిగ్గజం క్రిస్‌ గేల్‌కు సగర్వంగా వీడ్కోలు పలకాలని కరీబియన్లు భావిస్తున్నారు. భారత్‌తో వన్డే సిరీస్‌ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్న విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ ఎలా ఆడతాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రపంచ కప్‌లో అలరించలేకపోయిన గేల్‌.. ఈ సిరీస్‌లో రాణించి కెరీర్‌కు ఘన వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు. (చదవండి: ఇక వన్డే సమరం)

మరిన్ని వార్తలు