విండీస్‌ను భారత్ నిలువరించేనా!

10 Nov, 2016 00:17 IST|Sakshi
విండీస్‌ను భారత్ నిలువరించేనా!

మహిళల జట్ల తొలి వన్డే నేడు  
సాక్షి, విజయవాడ స్పోర్‌‌ట్స: తొమ్మిది నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని భారత మహిళల క్రికెట్ జట్టు... సొంతగడ్డపై పటిష్టమైన వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం జరుగనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్ నేపథ్యంలో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత్‌కు ప్రతి మ్యాచ్ కీలకమే. దీంతో విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి మెగా ఈవెంట్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని భావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాల్లేవు. విండీస్‌తో వన్డేల తర్వాత... పాక్‌తో జరగాల్సిన సిరీస్‌కు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల భారత్ గైర్హాజరు కావొచ్చు. దీంతో భారత్ పాయింట్లు కోల్పోయి క్వాలిఫయింగ్‌తో ప్రపంచకప్‌ను మొదలుపెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సత్తాచాటాలని మిథాలీ సేన భావిస్తోంది.  విజయవాడ సమీపంలోని మూలపాడులో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కొత్తగా నిర్మించిన మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు  బుధవారం ఈ మైదానాన్ని ప్రారంభించారు.

జట్లు:
భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), ఏక్తా బిస్త్, రాజేశ్వరి, జులన్ గోస్వామి,  కామిని, హర్మన్‌ప్రీత్ , వేద, స్మృతి మందన, మోన మేశ్రామ్, శిఖా పాండే, సుకన్య పరీదా, దీప్తి శర్మ, పూనమ్, సుష్మ, దేవిక.

వెస్టిండీస్: స్టెఫానీ టేలర్ (కెప్టెన్), అనిసా, మెరిస్సా, క్యాంప్‌బెల్, షమిలియా, బ్రిట్నీ కూపర్, డియాండ్ర, అఫీ ,నైట్, హేలీ మాథ్యూస్, చిడియన్, క్వింటినీ, షకీరా, ట్రెమేన్ స్మార్ట్.

మరిన్ని వార్తలు