పరువు నిలబెట్టుకోవాలని...

18 Mar, 2018 04:26 IST|Sakshi
మిథాలీ బృందం

నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల మూడో వన్డే  

ఉదయం గం. 9.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే 0–2తో సిరీస్‌ కోల్పోయిన మిథాలీ బృందం ఆదివారం జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఆసీస్‌ను నిలువరించాలంటే భారత్‌ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో స్మృతి మంధాన మెరుపులు మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోయారు.

ఆమెకు తోడు కెప్టెన్‌ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్‌ కౌర్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, పూనమ్‌ రౌత్‌ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి గైర్హాజరీలో శిఖా పాండే, పూజ వస్త్రకర్‌ ప్రభావం చూపలేకపోతున్నారు. స్పిన్నర్లు ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్‌ కూడా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు టాపార్డర్‌ రాణించడంతో రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆసీస్‌ ఆదివారం జరిగే పోరులోనూ గెలవాలని చూస్తోంది. రెండు వన్డేల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన బోల్టన్‌తో పాటు పెర్రీ, మూనీ, కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ ఫామ్‌లో ఉండటం కంగారూలకు కలిసొచ్చే అంశం.

మరిన్ని వార్తలు