భారత్ 'హ్యాట్రిక్'

24 Jul, 2016 18:28 IST|Sakshi
భారత్ 'హ్యాట్రిక్'

మన్హీమ్(అమెరికా):అమెరికా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది.  భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1 తేడాతో కెనడాను ఓడించి టోర్నీలో 'హ్యాట్రిక్' విజయం సాధించింది.  భారత మహిళల్లో పూనమ్ రాణి(19వ నిమిషం), రేణుకా యాదవ్(32వ నిమిషం), అనురాధా థాకోమ్(58వ నిమిషం)లో గోల్స్ సాధించి విజయంలో ముఖ్యభూమిక పోషించారు. భారత జట్టు ఐదో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా  దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి క్వార్టర్లో  ఇరు జట్లు డిఫెన్స్కే ఎక్కువ ప్రధాన్యత ఎటువంటి గోల్ నమోదు కాలేదు.

అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే పూనమ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. కాగా, ఆపై వెంటనే కెనడా క్రీడాకారిణి నటాలీ(21వ నిమిషం) గోల్ సాధించి స్కోరును సమం చేసింది. ఇక రెండో అర్ధభాగంలో పెనాల్టీ కార్నర్ను గోల్ మలచడంలో రేణుకా విజయవంతం కావడంతో భారత్ కు  2-1 ఆధిక్యం దక్కింది. ఆ తరువాత భారత రక్షణశ్రేణి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కెనడా వెనుకబడిపోయింది. ఇక రెండు నిమిషాల్లో గేమ్ ముగుస్తుందనగా భారత క్రీడాకారిణి అనురాధ అద్భుతమైన గోల్ నమోదు చేసి జట్టు ఘన విజయంలో సాధించడంలో సహకరించింది. ఇది కెనడాపై భారత్ కు రెండో విజయం కాగా, అంతకుముందు అమెరికాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్..ఆ తరువాత అంచనాలు అందుకుంటూ వరుస విజయాలతో సత్తా చాటుతోంది.

మరిన్ని వార్తలు