35 ఏళ్ల తర్వాత బెర్తు దొరికింది..

29 Aug, 2015 09:43 IST|Sakshi

భారత మహిళల హాకీ జట్టు 35 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్కు అర్హత సాధించింది. 2016 రియో ఒలింపిక్స్లో 12 జట్ల హాకీ ఈవెంట్లో భారత్ బెర్తును ఖరారు చేసుకుంది. యూరో హాకీ చాంపియన్షిప్ సెమీఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్కు మార్గం సుగమమైంది. ర్యాంకింగ్ ఆధారంగా భారత్కు బెర్తు దక్కింది.

భారత్ మహిళల హాకీ జట్టు చివరి సారిగా 1980 ఒలింపిక్స్లో ఆడింది. ఆ తర్వాత ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించలేకపోయింది. సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్లో ఆడబోతోంది.

>
మరిన్ని వార్తలు