విశాఖలో టీమిండియా ఘనవిజయం

18 Dec, 2019 21:16 IST|Sakshi

సాక్షి, విశాఖ : విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విండీస్‌పై 107 పరుగుల తేడాతో  నెగ్గి 3 వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 388 పరుగుల లక్ష్య చేదనతో బరిలోకి దిగిన విండీస్‌ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ షై హోప్‌ 78 పరుగులు, నికోలస్‌ పూరన్‌ 75 పరుగులు, కీమో పాల్‌ 46 పరుగులతో రాణించారు. భారత బౌలరల్లో కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌తో మెరవగా, మహ్మద్‌ షమీ 3వికెట్లు, రవీంద్ర జడేజా 2వికెట్లు, శార్దుల్‌ ఠాకూర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, లోకేష్‌ రాహుల్‌లు శతకాలతో మెరవగా, మిడిలార్డర్‌లో రిషబ్‌పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు దాటిగా ఆడి భారీ స్కోరుకు బాటలు వేశారు. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, కైరీ పియరీ 2 వికెట్లు పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం 22న కటక్‌లో జరగనుంది.
(చదవండి : ఒకే ఒక్కడు కుల్దీప్‌ యాదవ్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా