కష్టపడి నెగ్గిన టీమిండియా..

3 Aug, 2019 23:41 IST|Sakshi

ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో విజయం కోహ్లిసేన వైపే మొగ్గుచూపింది. దీంతో విండీస్‌ పర్యటనను కోహ్లి సేన విజయంతో ఆరంభించింది. విండీస్‌ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి భారత్‌ పూర్తి చేసింది. ఛేదనలో రోహిత్‌ శర్మ(24), విరాట్‌ కోహ్లి(19), మనీష్‌ పాండే(19)లు పర్వాలేదనిపించారు.  స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తీవ్రంగా కష్టపడింది. భారత ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్‌(1), రిషభ్‌ పంత్‌ (గోల్డెన్‌ డక్‌)లు ఘోరంగా విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, సునీల్‌ నరైన్‌, కీమో పాల్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

అంతకుముందు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా యువ బౌలర్‌ నవదీప్‌ సైనీ(3/17) విండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టించాడు. సైనీతో పాటు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో విండీస్‌ను కట్టడి చేశారు. విండీస్‌ ఆటగాళ్లలో కీరన్‌ పొలార్డ్‌(49; 49 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నికోలస్‌ పూరన్‌(20) ఫర్వాలేదనిపించాడు. దీంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.  భారత్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కృనాల్‌, రవీంద్ర జడేజాలు తలో వికెట్‌ తీశారు. విండీస్‌ పతనాన్ని శాసించిన నవదీప్‌ సైనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విండీస్‌కు షాక్‌.. 5 వికెట్లు టపాటపా..!

భారత్‌-విండీస్‌ టి20; రాహుల్‌ ఔట్‌

‘కోచ్‌ వస్తున్న సంగతి సచిన్‌ చెప్పలేదు..’

ఫైనల్లో సాత్విక్‌ జోడి

కోహ్లిపై జోక్‌.. నెటిజన్లు ఫైర్‌

రాహుల్‌ ముంగిట ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు

నేటి క్రీడా విశేషాలు

లియోనల్‌ మెస్సీపై నిషేధం!

క్రిస్‌ గేల్‌ మళ్లీ బాదేశాడు

‘పంత్‌.. నీకిదే మంచి అవకాశం’

మళ్లీ ‘బెయిల్స్‌’ గుబులు

ఆనాటి టీ20 మ్యాచ్‌ గుర్తుందా?

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫర్హార్ట్‌ సేవలు

విజేత నరేందర్‌

స్తుతిశ్రీకి 4 స్వర్ణాలు

సాయిప్రణీత్‌ నిష్క్రమణ

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్‌

టైటాన్స్‌ నాన్‌ టెక్నికల్‌ టై

ఆట మళ్లీ మొదలు

ఇదొక పనికిమాలిన చర్య: బ్రెట్‌ లీ

టీమిండియా కోచ్‌ అవుతా: గంగూలీ

వహాబ్‌ రియాజ్‌ గుడ్‌ బై?

యాషెస్‌ సిరీస్‌; ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ

ఇలా ఎగతాళి చేయడం బాధించింది: మెక్‌గ్రాత్‌

అండర్సన్‌ సారీ చెప్పాడు!

అప్పుడు వెన్నులో వణుకు పుట్టింది: స్మిత్‌

ఆ నిర్ణయం నా ఒక్కడిదే అంటే ఎలా?: బంగర్‌

రోహిత్‌ శర్మ కొట్టేస్తాడా?

సచిన్‌, కోహ్లిలను దాటేశాడు..

బైక్‌పై చక్కర్లు.. కిందపడ్డ క్రికెటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో హీరో, విలన్లు ఎవరంటే..?

ఆకట్టుకుంటోన్న ‘కథనం’ ట్రైలర్

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి