భారత్ చేతిలో ఓడిన జింబాబ్వే

26 Jul, 2013 20:45 IST|Sakshi
భారత్ చేతిలో ఓడిన జింబాబ్వే

సెల్కాన్ వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారమిక్కడ జరిగిన రెండో వన్డేలో జింబాబ్వేపై భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసింది. సిబందా 55, ఉతసియ 52, చిగుంబుర 46, మసకజ్జా 34 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భారత బౌలర్లలో ఉనద్కత్ 4 అమిత్ మిశ్రా 2 వికెట్లు తీశారు. షమీ, జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ(116), వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అర్థ సెంచరీ(69)లతో కదం తొక్కారు. ఐదో వికెట్కు వీరిద్దరూ 145 బంతుల్లో 150 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు.

విరాట్ కోహ్లి 14, అంబటి రాయుడు 5, అమిత్ మిశ్రా 9, రైనా 4, జడేజా 15 పరుగులు చేసి అవుటయ్యారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. జింబాబ్వే బౌలర్లలో విటోరి 2 వికెట్లు పడగొట్టాడు. ఛతారా, జార్విస్, ఉతసియ తలో వికెట్ తీశారు.

మరిన్ని వార్తలు