తొలి వన్డేలో జింబాబ్వేపై భారత్ గెలుపు

24 Jul, 2013 20:01 IST|Sakshi
తొలి వన్డేలో జింబాబ్వేపై భారత్ గెలుపు

ఐదు వన్డేల సిరీస్ ‘సెల్‌కాన్ కప్’లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 229 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 44.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అధిగమించింది. విరాట్ కోహ్లి(115) సెంచరీ సాధించాడు. అంబటి రాయుడు(63) అర్థ సెంచరీ చేశాడు. శిఖర్ ధావన్ 17, రోహిత్ శర్మ 20 పరుగులు సాధించారు. సురేష్ రైనా డకౌటయ్యాడు.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. జింబాబ్వే ఆటగాళ్లలో సిందకర్ రాజా 82, చిగుంబుర 43, సిబాంద 34, విలియమ్స్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 3 వికెట్లు పడగొట్టాడు. వినయ్ కుమార్, మహ్మద్ షమీ, ఉనాద్కత్, రైనా తలో వికెట్ తీశారు.

మరిన్ని వార్తలు