ఐదోవన్డే: జింబాబ్వేపై భారత్ ఘన విజయం

3 Aug, 2013 19:14 IST|Sakshi
ఐదోవన్డే: జింబాబ్వేపై భారత్ ఘన విజయం

5-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
బుల‌వాయో: ఐదవ వ‌న్డే సిరీస్‌లో భాగంగా బుల‌వాయోలో జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘ‌న‌విజ‌యం సాధించింది. దీంతో భార‌త్ 5-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్  చేసింది. 164 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ సునాయాసంగా స్కోరును ప‌రుగులు పెట్టిస్తూ బంతులను బౌండరీలను దాటించింది. ఐదో వ‌న్డేలో జింబాబ్వేతో త‌ల‌ప‌డిన భార‌త్ తక్కువ విజ‌య ల‌క్ష్యమైనా నేర్పుతో ఆడి విజ‌య‌దుంధూబి మోగించింది.  భార‌త్ ఓపెన‌ర్ బ్యాట్స్‌మన్ ధావ‌న్ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తూ చ‌క్కని ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో (6x4; 1x6)తో 41 ప‌రుగులు చేసి క్రీడాభిమానుల‌ను మెప్పించాడు. ధావ‌న్ భాగ‌స్వామ్యంతో ఓపెన‌ర్‌గా దిగిన పూజారే మాత్రం ప‌రుగులేమీ చేయ‌కుండానే వెనుతిరిగినా.. ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చినా ర‌హెనా 50 ప‌రుగుల‌తో త‌న‌దైనా శైలీలో చక్కగా రాణించాడు. ఆ త‌రువాత వ‌చ్చిన జ‌డేజా త‌న బ్యాటింగ్ ప్రతిభ‌తో జింబాబ్బే బౌల‌ర్లకు చుక్కలు చూపించాడు. జ‌డేజా (48) కార్తీక్ (10) పరుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన జింబాబ్వే 163 పరుగులకు ఆలౌటైంది. కేవలం 39.5 ఓవర్లలో జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్ప కూలింది. ఓపెన‌ర్ బ్యాట్స్‌మెన్ విలియ‌మ్స్ 65 బంతుల్లో (6 ఫోర్లు) 51 ప‌రుగులు చేసి అద‌ర‌హో అనిపించ‌నా.. త‌న ఒక్కడి శ్రమ జింబాబ్వే జ‌ట్టును ఆదుకోలేక పోయింది. మిగతా ఆటగాళ్లు షిబానా (5), మార్మా (4), వాల‌ర్ (8) పరుగులు చేసి ఒక‌టి, రెండెంకెల స్కోరుల‌కే ప‌రిమిత‌మైయ్యారు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో రైనా క్యాచ్ ప‌ట్టడంతో ముత్తాంబెడ్జీ 4 ప‌రుగులు చేసి చేతులెత్తేశాడు. గాంబురా (17) ప‌రుగులు చేయ‌గా, టైయిల‌ర్ ప‌రుగులు చేయ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. భార‌త్ బౌల‌ర్లు విసిరిన బంతులా మాయాజాలానికి ఒక‌రి త‌రువాత ఒక‌రు స్వల్ప స్కోరుతోనే పెవిలీయ‌న్ బాట ప‌ట్టారు. ఈ సిరీస్‌లో భారత బౌలర్లలో అమిత్‌ మిశ్రాకు ఆరు వికెట్లు లభించడం విశేషం.

మరిన్ని వార్తలు