రెండో టెస్టులో భారత్ విజయం

21 Jul, 2014 19:54 IST|Sakshi
రెండో టెస్టులో భారత్ విజయం

లండన్: లార్డ్స్ టెస్టులో భారత్ చెలరేగిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో రెండో టెస్టును కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ బౌలర్లు జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్నిఅందించారు. గెలుపుపై తొలుత ఉత్కంఠ నెలకొన్నాబౌలర్లు విజృంభించి వరుస వికెట్లు నేలకూల్చడంతో 95 పరుగుల తేడాతో ఇండియా జయకేతనం ఎగురవేసింది. చివరి రోజు  భోజన విరామ సమయం అనంతరం ఇంగ్లిష్ ఆటగాళ్లలో నిలకడలేమి లోపించి వెనువెంటనే వికెట్లుచేజార్చుకున్నారు. ఓవర్ నైట్ స్కోర్105 పరుగులకు నాలుగు వికెట్లతో  ఐదో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ 223 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. దీంతో 28 ఏళ్ల తరువాత లార్డ్స్ లో టెస్ట్ మ్యాచ్ ను గెలిచిన భారత జట్టుగా ధోనీ సేన చరిత్రను తిరగరాసింది. 

 

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో రూట్(66), ఆలీ(39),కుక్(22),బ్యాలెన్స్ (27) పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో ఇఏడు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ ఇంగ్లండ్ వెన్నువిరిచి గెలుపులో కీలక పాత్ర పోషించగా, మహ్మద్ షమీ, జడేజాలకు తలో వికెట్టు దక్కింది.

 

స్కోరు వివరాలు

భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్:342
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ :223   

మరిన్ని వార్తలు