కివీస్‌తో తొలి టీ20 : ధోని, పంత్‌ బ్యాక్‌

6 Feb, 2019 12:38 IST|Sakshi

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేజింగ్‌కు మొగ్గు చూపాడు. చేజింగ్‌లో మంచి రికార్డు ఉండటంతోనే ఫీల్డింగ్‌ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌తో రిషభ్‌‌, కృనాల్‌ పాండ్యాలు తుది జట్టులోకి వచ్చారు. దీంతో పాండ్యా బ్రదర్స్‌ తొలిసారి కలిసి అంతర్జాతీయ టీ20 ఆడుతున్నారు. ఇక వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై టీ20 సిరీస్‌లకు తప్పించిన వెటరన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేశాడు.

మరోవైపు ఆతిథ్య జట్టు.. డాషింగ్‌ ఓపెనర్‌ గప్టిల్, ప్రధాన పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ లేకుండానే బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌ ద్వారా డెరిల్‌ మిచెల్‌ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. ఇక వన్డే సిరీస్‌ గెలిచిన ఊపులో ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌ గెలిచి కివీస్‌ గడ్డపై రికార్డు నమోదు చేయాలని భావిస్తోంది. ఇప్పటికి భారత్‌ న్యూజిలాండ్‌లో ఒక్క టీ20 గెలవలేదన్న విషయం తెలిసిందే. మరోవైపు ఎలాగైన ఈ సిరీస్‌ను గెలుచుకొని పరువు కాపోడుకోవాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, పంత్, దినేశ్‌ కార్తీక్, ధోని, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, ఖలీల్, చహల్, విజయ్‌ శంకర్‌
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), మున్రో, సీఫ్రెట్, రాస్‌ టేలర్, డెరిల్‌ మిచెల్‌, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, స్కాట్‌ కుగ్లీన్, ఫెర్గూసన్,సౌథీ, ఇష్‌ సోధి.

మరిన్ని వార్తలు