ఆసియాకప్‌ ఫైనల్‌ : బంగ్లాదే బ్యాటింగ్‌

28 Sep, 2018 16:49 IST|Sakshi

దుబాయ్‌ : ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. గత అఫ్గాన్‌ మ్యాచ్‌ సందర్భంగా విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్లు తుదిజట్టులోకి వచ్చారు. రోహిత్‌ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్‌. పరుగులు చేయడం ముఖ్యమే. కానీ ఫీల్డింగ్‌ మా జట్టుకు కలిసొస్తుంది. ఇప్పటికే మేం చేజింగ్‌లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్‌లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్‌ ఆడాం. గత మ్యాచ్‌లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం. దురదృష్టవశాత్తు యువ ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌ ఆడగలిగారు.’ అని తెలిపాడు. 

బంగ్లాదేశ్‌ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. మోమినుల్‌ హక్‌ స్థానంలో నజ్ముల్‌ ఇస్లామ్‌ తుది జట్టులోకి వచ్చాడు. బంగ్లా కెప్టెన్‌ మొర్తజా మాట్లాడుతూ..‘ఫైనల్‌ చేరిన క్రెడిట్‌ అంతా మా ఆటగాళ్లదే. కొన్ని మ్యాచుల్లో వారి ప్రదర్శనతో అదరగొట్టారు. ఈ రోజు చివరిబంతి వరకు పోరాడుతాం. మా జట్టులో స్పిన్నర్‌ లేడు. దానికోసం జట్టులోకి నజ్ముల్‌ ఇస్లామ్‌ను తీసుకున్నాం. మాకు మంచి అవకాశం ఉంది. వారిది నెం1 జట్టు. వాళ్లపై ఒత్తిడి ఉంటుంది. ఇది మేం అందిపుచ్చుకుంటే మాకు అవకాశం ఉంటుంది’ అని తెలిపాడు. ఈ మ్యాచ్‌ గెలిచి టైటిల్‌ నెగ్గాలని భారత్‌ భావిస్తుంటే.. ఎలాగైనా గెలిచి సంచలనం సృష్టించాలని బంగ్లా భావిస్తోంది.

తుది జట్లు
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, దినేశ్‌ కార్తీక్, ధోని, కేదార్‌ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్, బుమ్రా 
బంగ్లాదేశ్‌: మొర్తజా (కెప్టెన్‌), లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్‌ ఇస్లామ్‌, ముష్ఫికర్, మొహమ్మద్‌ మిథున్, ఇమ్రుల్‌ కైస్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, రూబెల్‌ హుస్సేన్, ముస్తఫిజుర్‌  

మరిన్ని వార్తలు