పృథ్వీ షా@ 293

4 Oct, 2018 09:26 IST|Sakshi

రాజ్‌కోట్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యువ సంచలనం పృథ్వీ షా టీమిండియా తరుపున అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సారథి విరాట్‌ కోహ్లి టీమిండియా టెస్టు క్యాప్‌ను పృథ్వీకి అందజేశారు. భారత్‌ తరుపున టెస్టు ఆడుతున్న 293 వ ఆటగాడిగా పృథ్వీ గుర్తింపు పొందాడు. దీంతో 11 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఆడుతున్న పిన్న వయస్కుడి (18 ఏళ్ల 329 రోజులు)గా  ఘనత సాధించాడు. గురువారం నుంచి వెస్టిండీస్-భారత్‌ల మధ్య సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానంలో తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా సారథి బ్యాటింగ్‌ వైపే మొగ్గు చూపాడు. (పృథ్వీ షా అద్భుత ప్రస్థానం)

ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలొకి దిగాలని కోహ్లి భావించడంతో ముందుగా ప్రకటించిన జాబితా నుంచి శార్దూల్‌ను పక్కన పెట్టి కుల్దీప్‌కు అవకాశం కల్పించారు.  గత సిరీస్‌లలోగా బ్యాటింగ్‌ విభాగంలో ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లని మేనేజ్‌మెంట్‌ చటేశ్వర పుజారా, అజింక్యా రహానేలను తుది జట్టులో కొనసాగించింది. ఇక వెస్టిండీస్‌ కూడా పెద్దగా మార్పులు చేయకుండానే బంగ్లాదేశ్‌తో ఆడిన టీమ్‌ను కొనసాగించింది. కరీబియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కీమన్‌ రోచ్‌ స్వదేశం వెళ్లడంతో అతడి స్థానంలో కీమో పాల్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఇక ఈ పిచ్‌ తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ స్కోర్‌లు నమోదయ్యే అవకాశం ఉంది.  

జట్లు 
టీమిండియా: కేఎల్‌ రాహుల్, పృథ్వీ షా, పుజారా, కోహ్లి, రహానే, పంత్, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్, కుల్దీప్

విండీస్‌: బ్రాత్‌వైట్, కీరన్‌ పావెల్, షై హోప్, సునీల్‌ ఆంబ్రిస్, ఛేజ్, హేట్‌మెయిర్, డౌరిచ్, షర్మన్‌ లూయీస్‌, కీమో పాల్, గ్రాబియెల్, బిషూ

చదవండి: రాజకోటలో విజయం వేటకు 

మరిన్ని వార్తలు