మూడో వన్డే; టాస్‌ గెలిచిన టీమిండియా

27 Oct, 2018 13:21 IST|Sakshi

పుణె: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ముందుగా విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేల్లో భారత్‌ తొలి మ్యాచ్‌లో గెలవగా, రెండో వన్డే టైగా ముగిసింది. దాంతో ఈ సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది.  ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రాలు తిరిగి జట్టులో చేరడంతో టీమిండియా బౌలింగ్‌ మరింత బలంగా మారింది. ఉమేశ్ యాదవ్‌, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చారు.

ఏకపక్షంగా సాగుతుందనుకున్న వన్డే సిరీస్‌ను విశాఖపట్నంలో అనూహ్య పోరాటంతో ఆసక్తికరంగా మార్చింది వెస్టిండీస్‌. తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరు చేసి... రెండో వన్డేలో ఛేదనలో ప్రత్యర్థి స్కోరును సమం చేసి తమను తక్కువగా చూడొద్దని చాటింది. బ్యాట్స్‌మెన్‌ పట్టుదలతో పోటీలో నిలిచింది. మరోవైపు భారత్‌ తప్పనిసరిగా శక్తులను కూడదీసుకునేలా చేసింది. బౌలర్లకు కఠిన పరిస్థితులు ఎదురవుతుండటంతో టీమిండియా సైతం అప్రమత్తమైంది. దానిలో భాగంగానే బూమ్రా, భువనేశ్వర్‌లకు తుది జట్టులో అవకాశం కల్పించింది.

తుది జట్లు

భారత్‌; విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని, రిషబ్‌ పంత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, బూమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, చాహల్

వెస్టిండీస్‌; కీరన్‌ పావెల్‌, చంద‍్రపాల్ హెమ్రాజ్‌, సాయ్‌ హోప్‌, మార్లోన్‌ శామ్యూల్స్‌, హెట్‌మెయిర్‌, రోవ్‌మాన్‌ పావెల్‌, జాసన్‌ హోల్డర్‌, ఫాబియన్‌ అలెన్‌, అశ్లే నర్స్‌, కీమర్‌ రోచ్‌, మెక్‌కాయ్‌

మరిన్ని వార్తలు