అభిషేక్‌కు స్వర్ణం, సౌరభ్‌కు కాంస్యం 

31 Aug, 2019 06:41 IST|Sakshi

ఒకే ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు

షూటింగ్‌ ప్రపంచ కప్‌  

రియో డి జనీరో:  ప్రపంచ కప్‌ షూటింగ్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో భారత్‌కు 2 పతకాలు లభించాయి. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అయిన అభిషేక్‌ వర్మ బంగారు పతకంతో మెరవగా, 17 ఏళ్ల సౌరభ్‌ చౌదరికి కాంస్యం లభించింది. ఈ ఈవెంట్‌లో అభిషేక్‌ 244.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 221.9 పాయింట్లు స్కోర్‌ చేసిన సౌరభ్‌కు మూడో స్థానం దక్కింది. టర్కీకి చెందిన ఇస్మాయిల్‌ కెలెస్‌ 243.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. ప్రస్తుతం భారత్‌ 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అభిషేక్, సౌరభ్‌ ఇద్దరూ గత క్వాలిఫయింగ్‌ టోర్నీలోనే రాణించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగం క్వాలిఫయింగ్‌లో పదో స్థానంలో నిలిచిన చింకీ యాదవ్‌ త్రుటిలో ఫైనల్‌ అవకాశం చేజార్చుకుంది.

మరిన్ని వార్తలు