నాటి రిజర్వ్‌డేలో భారత్‌ గెలిచింది.. ఇప్పుడూ?

10 Jul, 2019 12:21 IST|Sakshi
ప్రపంచకప్‌-1999లో భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌

మాంచెస్టర్‌ : వర్షం కారణంగా ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వేడేకు వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే  ప్రపంచకప్‌లో భారత్‌ ప్రత్యర్థిగా ఉన్న ఓ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడటం ఇది రెండోసారి. ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన 1999 ప్రపంచకప్‌లో తొలిసారి ఈ సంఘటన జరిగింది. బర్మింగ్‌హామ్‌లో మే 29న భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ కూడా రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అయితే తొలి రోజు భారత ఇన్నింగ్స్‌ (232/8) ముగిసి, ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమయ్యాక వర్షం రావడంతో రిజర్వ్‌డే అయిన మే 30న ఈ మ్యాచ్‌ను కొనసాగించారు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాటి ఓపెనర్‌ సౌరవ్‌​ గంగూలీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన(40 పరుగులు, 3 వికెట్లు)తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో భారత్‌ సూపర్‌ సిక్స్‌లో వెనుదిరగగా.. పాక్‌, ఆస్ట్రేలియా ఫైనల్లో తలపడ్డాయి. టైటిల్‌ మాత్రం ఆస్ట్రేలియానే వరించిన సంగతి తెలిసిందే. అయితే నాటి రిజర్వ్‌డే భారత్‌కు కలిసొచ్చిందని ఇప్పుడూ కూడా గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు