ఐసీసీ సీఎఫ్‌వోగా అంకుర్‌ ఖన్నా

21 Mar, 2017 00:06 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నూత న ముఖ్య ఆర్థిక వ్యవహారాల అధికారి (సీఎఫ్‌వో)గా భారత్‌కు చెందిన అంకుర్‌ ఖన్నా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎయిర్‌ ఆసియా ఇండియా సీఎఫ్‌వోగా వ్యవహరిస్తుండగా ఈనెలాఖరులో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఐసీసీ నూతన నియమావళిలో చేసిన పలు మార్పులు అనిశ్చితంగా, అస్పష్టంగా ఉన్నాయని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఐసీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి ఇయాన్‌ హిగ్గిన్స్‌కు ఆయన లేఖ రాశారు.

మరిన్ని వార్తలు