భారత అథ్లెట్ సుధాకు 'జికా'పరీక్షలు!

23 Aug, 2016 11:01 IST|Sakshi
భారత అథ్లెట్ సుధాకు 'జికా'పరీక్షలు!

రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్ సుధా సింగ్ తీవ్ర జ్వరానికి గురి కావడంతో ఆమెకు  జికా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ ముగిసిన అనంతరం బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్కు చేరిన సుధా సింగ్కు విపరీతమైన జ్వరం వచ్చింది.  దాంతోపాటు బాగా నీరసించిపోవడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఫోర్టిస్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే దోమ కాటు ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్గున్యాలు ఆమెకు సోకలేదని లేదని అక్కడ చేసిన టెస్టుల్లో తేలింది.

కాగా,  బ్రెజిల్ లో జికా వైరస్ తీవత్ర హెచ్చుగా ఉండటంతో  ఆ మేరకు టెస్టులు కూడా చేయాలని డాక్టర్లు భావించారు. దానిలో భాగంగా ఆమె రక్త నమూనాను పుణెలోని జికా వైరస్ ఇనిస్టిట్యూట్కు పంపారు. మంగళవారం ఈ వైరస్కు సంబంధించిన టెస్టులు పూర్తయిన తరువాత రిపోర్ట్ వెల్లడిస్తామని కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. రియో ఒలింపిక్స్లో సుధా సింగ్ మూడు వేల మీటర్ల స్టీపల్ చేజ్లో పాల్గొంది.

మరిన్ని వార్తలు