భారత బాక్సర్లకు అనుమతి

29 Aug, 2013 02:08 IST|Sakshi

పాటియాల : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ ఒక్క టోర్నీలో పాల్గొనేందుకు అంతర్జాతీయ అమోచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) అనుమతించింది. అయితే దీని తర్వాత జరగబోయే టోర్నీల్లో పాల్గొనాలంటే మాత్రం కచ్చితంగా నవంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)ను ఆదేశించింది. రెండు రోజుల సెలక్షన్ ట్రయల్స్ అనంతరం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 10 మంది సభ్యులుగల భారత జట్టును ఎంపిక చేశారు. ప్రపంచ చాంపియన్‌షిప్ అక్టోబరు 11 నుంచి 27 వరకు కజకిస్థాన్‌లో జరుగుతుంది.
 
 భారత జట్టు: నానో సింగ్ (49 కేజీలు), మదన్ లాల్ (52 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ మాలిక్ (60 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్‌దీప్ జాంగ్రా (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు), సుమీత్ సాంగ్వాన్ (81 కేజీలు), మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు).
 

మరిన్ని వార్తలు