ధోని.. సైన్యంలో చేరిపోయాడు

26 Jul, 2019 05:49 IST|Sakshi

శిక్షణ ప్రారంభించిన టీమిండియా దిగ్గజం

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన రెండు నెలల సైనిక శిక్షణను ప్రారంభించాడు. పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని... బెంగళూరులోని బెటాలియన్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేశాడు. అతడు ఈ నెల 31 నుంచి ఆగస్ట్‌ 19 వరకు బెటాలియన్‌తో ఉంటాడు. విక్టర్‌ ఫోర్స్‌లో భాగంగా దీని యూనిట్‌ కశ్మీర్‌ లోయలో విధులు నిర్వర్తిస్తోంది. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని... పహారా, గార్డ్, సెంట్రీ పోస్ట్, దళంలో భాగమవడం తదితర బాధ్యతలు చేపడతాడు. ‘ధోనిలాంటి భారత క్రికెట్‌ దిగ్గజం తీసుకున్న నిర్ణయం.. దేశ యువతలో సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది. అతడు కోరుకునేది కూడా అదే’ అని ఓ అధికారి తెలిపాడు. వైమానిక దళ విమానం నుంచి ఐదు పారాచూట్‌ జంపింగ్‌లు చేయడం ద్వారా ధోని 2015లోనే పారాట్రూపర్‌గా అర్హత సాధించాడు. 

మరిన్ని వార్తలు