ఎక్కడి నుంచైనా  ఓటు వేయనివ్వండి 

26 Mar, 2019 01:18 IST|Sakshi

ప్రధానికి క్రికెటర్‌ అశ్విన్‌ విజ్ఞప్తి   

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతీ ఒక్కరు ఓటు వేసే విధంగా అవగాహన పెంచే కార్యక్రమానికి మద్దతు పలకాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెటర్లను కూడా భాగం చేస్తూ ట్వీట్‌ చేశారు. ఇందులో అశ్విన్, శిఖర్‌ ధావన్, భువనేశ్వర్‌ పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన అశ్విన్‌... ప్రజాస్వామ్య దేశంలో కీలకమైన ఓటును అందరూ వినియోగించి సరైన నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. అయితే పనిలో పనిగా తన వైపు నుంచి మరో విజ్ఞప్తిని కూడా ప్రధానికి పంపాడు.

ఐపీఎల్‌ కారణంగా వేర్వేరు నగరాల్లో ఉండాల్సి వస్తున్న తమ క్రికెటర్ల తరఫున అతను ట్వీట్‌ చేశాడు. ‘ఐపీఎల్‌లో ఆడుతున్న ప్రతీ క్రికెటర్‌ తాము ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిందిగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ప్రధానికి అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. ఇలాంటి అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం క్రికెటర్‌ విజ్ఞప్తిపై ఏమైనా స్పందిస్తుందో చూడాలి.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనధికార వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం : ద్వివేదీ

ఇక ఆపండ్రా నాయనా.. ఆ ట్వీట్‌ తీసేశా!

బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’

కోహ్లి తర్వాతే అతనే సరైనోడు..!

ఐపీఎల్‌ ఫైనల్‌ చాలా ‘హాట్‌’ 

వాట్సన్‌పై ముంబై ఫ్యాన్స్‌ కామెంట్స్‌

‘డబ్బు కోసమే.. ధోనిని ఔట్‌గా ప్రకటించారు’

కుంబ్లేను గుర్తుచేశావ్‌ వాట్సన్‌..

‘థ్యాంక్యూ సచిన్‌ సర్‌’

వార్నీ.. కేఎల్‌ రాహుల్‌ అవార్డు.. పాండ్యా చేతికి!

ఈ సీజనే అత్యుత్తమం 

బేసి... సరి అయినప్పుడు! 

క్యాప్‌లు సాధించకున్నా.. కప్‌ గెలిచాం..

‘ధోని హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది’

ఐపీఎల్‌-12లో జ్యోతిష్యమే గెలిచింది..

నాలుగు కాదు.. ఐదు: రోహిత్‌