హాకా... హాకా..! 

26 Jan, 2019 01:09 IST|Sakshi

భారత క్రికెటర్లకు మౌంట్‌ మాంగనీ మైదానంలో ‘పౌహిరి’ సాంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది. ఇందులో భాగంగా స్థానిక మావోరీ తెగకు చెందిన వారు ముందుగా ‘హాకా డ్యాన్స్‌’ను టీమిండియా ఆటగాళ్ల ముందు ప్రదర్శించారు. ఆవేశంగా రెండు కాళ్లతో నేలను బలంగా కొట్టడంతో పాటు ‘హాకా హాకా’ అంటూ గట్టిగా అరవడం ఈ డ్యాన్స్‌లో కనిపిస్తుంది. అనంతరం ఎదురెదురుగా వెళ్లి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం సహా ఒకరి నుదురు, ముక్కులను మరొకరి నుదురు, ముక్కుతో రాయడం కూడా పౌహిరిలో భాగమే.

దీనిని ‘హోంగీ’గా వ్యవహరిస్తారు. వేర్వేరు క్రీడాంశాలకు చెందిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు తరచుగా దీనిని మైదానంలో ప్రదర్శిస్తుండగా... జాతీయ రగ్బీ టీమ్‌ మాత్రం ‘హాకా’కు బాగా ప్రాచుర్యం కల్పించింది. కోహ్లి మైదానానికి రాకపోవడంతో రోహిత్‌ శర్మ జట్టును ముందుండి నడిపించాడు. ఇది చాలా సరదాగా అనిపించిందని, వారి దీవెనలు అందుకున్నట్లుగా అనిపించిందని దీనిపై శిఖర్‌ ధావన్‌ వ్యాఖ్యానించాడు.    

మరిన్ని వార్తలు