21 ఏళ్ల తర్వాత...

5 May, 2017 00:27 IST|Sakshi
21 ఏళ్ల తర్వాత...

టీమిండియా@ 100  

న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల అనంతరం భారత ఫుట్‌బాల్‌ జట్టు ర్యాంకింగ్స్‌ టాప్‌–100లో నిలిచింది. ఫిఫా తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఒక ర్యాంకు మెరుగుపర్చుకుని 100వ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్స్‌లో టాప్‌–100లో నిలవడం భారత్‌కిది ఆరోసారి మాత్రమే కావడం విశేషం. చివరిసారి ఏప్రిల్‌ 1996లో టాప్‌–100లో నిలిచిన భారత్‌ మరో 21 ఏళ్ల తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయడం విశేషం.

మరోవైపు ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత అత్యుత్తమ స్థానం 94 కావడం గమనార్హం. మరోవైపు ఆసియా స్థాయిలో భారత్‌ 11వ స్థానంలో నిలిచింది. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన చీఫ్‌ కోచ్‌ స్టీఫెన్‌ కాంస్టంటైన్‌.. తాము సరైన దారిలో వెళుతున్నమనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని కీలకమైన మ్యాచ్‌లున్న క్రమంలో అలసత్వానికి ఏమాత్రం తావివ్వరాదని తెలిపారు. మరోవైపు టీమిండియా పురోగతిపై అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శి కుశాల్‌ దాస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు