హరికృష్ణ ‘డ్రా’ల పరంపర...

11 Jul, 2017 01:01 IST|Sakshi
హరికృష్ణ ‘డ్రా’ల పరంపర...

‘ఫిడే’ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ వరుసగా నాలుగో ‘డ్రా’ను నమోదు చేశాడు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం ఇయాన్‌ నెపోమ్‌నియాచిచి (రష్యా)తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఐదో రౌండ్‌ తర్వాత హరికృష్ణ ఖాతాలో మూడు పాయింట్లున్నాయి.  
 

మరిన్ని వార్తలు