బీసీసీఐకి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఘాటు లేఖ!

7 Dec, 2017 12:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్‌-శ్రీలంక టెస్టు మ్యాచ్‌ సందర్భంగా కాలుష్య వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాయుకాలుష్యం తీవ్రంగా ఉందంటూ పలువురు శ్రీలంక ఆటగాళ్లు పదేపదే ఎంపైర్లకు ఫిర్యాదు. అంతేకాకుండా పలువురు ఆటగాళ్లు ముఖానికి మాస్క్‌ కట్టుకొని మైదానంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) బీసీసీఐకి ఘాటు లేఖ రాసింది.

ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యం ఉన్నప్పటికీ భారత్‌-శ్రీలంక టెస్టు మ్యాచ్‌ నిర్వహించడాన్ని ఐఎంఏ తప్పుబట్టింది. ఐఎంఏ తీరు తమను చాలా ఇబ్బంది పెట్టిందని పేర్కొంది. 'వాయుకాలుష్యం కూడా క్రీడాకారుల సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఆటగాళ్ల జయాపజయాల్లో మిల్లి సెంకండ్‌, మిల్లిమీటర్‌ కూడా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఆటగాళ్ల ప్రదర్శనపై వాయుకాలుష్య ప్రభావం కూడా కీలకమైనదే' అని తన లేఖలో పేర్కొంది. 

వర్షం, సరైన వెలుతురు లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆడటానికి అనువైన వాతావరణం ఉందా? లేదా? అన్నది నిర్ధారిస్తున్నారని, వాతావరణ కాలుష్యాన్ని సైతం ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించింది.

మరిన్ని వార్తలు