ఆసీస్‌ చేతిలో భారత్‌ చిత్తు 

16 May, 2019 02:35 IST|Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియా పర్యటనలో ‘ఎ’ జట్టుపై రాణించిన భారత హాకీ టీం అసలు పోరులో చిత్తయింది. ఆస్ట్రేలియా ప్రధాన జట్టుతో బుధవారం జరిగిన తొలి టెస్టులో భారత్‌ 0–4తో కంగుతింది. ఆసీస్‌ తరఫున బ్లేక్‌ గోవర్స్‌ (15, 60వ నిమిషాల్లో), జెరెమీ హేవర్డ్‌ (20, 59వ నిమిషాల్లో) చెరో 2 గోల్స్‌ చేసి జట్టుకు ఘనవిజయాన్నిచ్చారు. ఆరంభంలో భారత ఆటగాళ్లే మెరుగ్గా ఆడారు. స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్టే లక్ష్యంగా దూసుకెళ్లారు. కానీ స్కోరు చేయలేకపోయారు. తొలి క్వార్టర్‌ ఐదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలచలేకపోయాడు. మళ్లీ 12వ నిమిషంలో కూడా పెనాల్టీ కార్నర్‌ లభించినా హర్మన్‌ప్రీత్‌ విఫలమయ్యాడు. నీలకంఠ శర్మతో సమన్వయం కుదరక గోల్‌ అవకాశం మళ్లీ చేజారింది. క్షణాల వ్యవధిలో తొలిక్వార్టర్‌ ముగుస్తుందనగా గోవర్స్‌ అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆసీస్‌కు శుభారంభాన్నిచ్చాడు.

రెండో క్వార్టర్‌ మొదలైన ఐదు నిమిషాలకే మరో పెనాల్టీ కార్నర్‌ను హేవర్డ్‌ గోల్‌గా మలిచాడు. దీంతో 2–0తో ఆసీస్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా భారత శిబిరం ఒత్తిడిలో కూరుకుపోయింది. అయితే మూడో క్వార్టర్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. ఆఖరి క్వార్టర్‌ ఆరంభంలో భారతే బాగా ఆడినా... మళ్లీ ఫినిషింగ్‌ ఆస్ట్రేలియాదే అయింది. కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ చేసేందుకు కదం తొక్కినా... ఆస్ట్రేలియన్‌ డిఫెండర్‌ డర్స్‌ అద్భుతంగా డైవ్‌ చేసి మన్‌ప్రీత్‌ షాట్‌ను నీరుగార్చాడు. 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ లభిస్తే మరోసారి హర్మన్‌ప్రీత్‌ విఫలమయ్యాడు. కానీ ప్రత్యర్థి జట్టు నుంచి హేవర్డ్, గోవర్స్‌ ఇద్దరూ రెండో గోల్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆఖరి పోరు జరుగనుంది.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రామ్‌కుమార్‌ ఓటమి 

రిటైర్మెంట్‌  తర్వాత... పెయింటర్‌గా మారుతానన్న ధోని  

నా జీతం  పెంచండి: జోహ్రి 

భారత్‌ శుభారంభం

గెలిస్తే నాకౌట్‌ దశకు 

పాక్‌ జట్టులో మూడు మార్పులు  

కివీస్‌ కప్‌ కొట్టేదెప్పుడు!

బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్‌

‘సచిన్‌ను మళ్లీ మైదానంలో చూసినట్టుంది’

అచ్చం ధోనిలానే..

‘ద్యుతీ చంద్‌ ప్రమాదంలో ఉంది’

పాక్‌ ప్రపంచకప్‌ జట్టులో భారీ మార్పులు!

అతడికి ఇష్టమైన క్రికెటర్‌ ఆమె!

వరల్డ్‌ కప్‌ ఫేవరెట్‌ ఆ టీమే..!

అప్పటివరకు విశ్రాంతి తీసుకోను: హార్దిక్‌

కరాటేలో బంగారు పతకం

క్రికెటర్‌ ఇంట విషాదం

టాప్‌ సీడ్‌గా సంజన

రాణించిన తెలంగాణ జట్లు

చాంపియన్‌ జె. రామకృష్ణ

రాఫెల్‌ నాదల్‌ ఖాతాలో 34వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌

అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్‌

విదేశీ టి20లపై యువరాజ్‌ ఆసక్తి

కౌంటీ క్రికెట్‌ మ్యాచ్‌లకు అశ్విన్‌

ఘనంగా క్రికెటర్‌ విహారి వివాహం

ఔరా... ఇంగ్లండ్‌!

రిటైర్డ్‌ ఆటగాడు రిజర్వ్‌ జాబితాలో!

సమరానికి ‘సఫారీ’ సిద్ధం!

‘బుమ్రా బౌలింగ్‌ వెనుక రాకెట్‌ సైన్స్‌’

ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా : ద్యుతీచంద్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

సమస్యలపై మేజర్‌ పోరాటం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త