ఓటమితో ముగింపు

7 Jun, 2017 00:43 IST|Sakshi

డసెల్‌డార్ఫ్‌ (జర్మనీ): మూడు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌ను భారత పురుషుల జట్టు ఓటమితో ముగించింది. జర్మనీతో మంగళవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–2 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. జర్మనీ తరఫున ఒలెప్రింజ్‌ (7వ నిమిషంలో), హెర్జ్‌బ్రచ్‌ (60వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.

మూడో జట్టుగా బెల్జియం బరిలోకి దిగిన ఈ టోర్నీలో జర్మనీ మొత్తం ఏడు పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత్‌ ఒక విజయం, ఒక ‘డ్రా’తో నాలుగు పాయింట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండు విజయాలు సాధించిన బెల్జియం ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 

మరిన్ని వార్తలు