కోహ్లి సేన కొత్త చరిత్ర

15 Aug, 2017 06:04 IST|Sakshi
కోహ్లి సేన కొత్త చరిత్ర

విదేశీ గడ్డపై తొలిసారి 3–0తో క్లీన్‌ స్వీప్‌
శ్రీలంకపై ఇన్నింగ్స్‌ 171 పరుగుల తేడాతో గెలుపు
మూడో రోజే ముగిసిన చివరి టెస్టు
అశ్విన్‌కు నాలుగు వికెట్లు  


తమ టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అతిరథ మహారథులెందరికో సాధ్యం కాని ఘనతను విరాట్‌ కోహ్లి సేన సాధించి చూపించింది. దశాబ్దాలుగా అందకుండా ఊరిస్తున్న విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ను అదిరిపోయే రీతిలో  దక్కించుకుంది. సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టును భారత్‌ మూడో రోజే ఇన్నింగ్స్‌ 171 పరుగుల తేడాతో చేజిక్కించుకుంది. అశ్విన్‌ స్పిన్‌ మాయకు తోడు షమీ పదునైన బంతులకు శ్రీలంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలమైంది. అలాగే వరుసగా ఎనిమిదో టెస్టు సిరీస్‌ను భారత్‌ తమ ఖాతాలో వేసుకుంది.  

పల్లెకెలె: ఊహించిన ఫలితమే వచ్చింది. సిరీస్‌ ఆద్యంతం పూర్తి ఆధిపత్యం వహించిన టీమిండియా ఆఖరి టెస్టులో శ్రీలంకను మరింత వణికించింది. సోమవారం మూడోరోజు ఆటలో ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ ఏమైనా పోరాడతారేమోనని భావించినా భారత బౌలింగ్‌ ధాటికి పేకమేడలా కుప్పకూలారు. కచ్చితంగా చెప్పాలంటే రెండున్నర రోజుల్లోనే లంక మ్యాచ్‌ను అప్పగించింది. దీంతో కోహ్లి సేన మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 171 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఈ సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. విదేశాల్లో భారత్‌కు ఈ మాదిరి విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి నిలిచాడు. గతంలో న్యూజిలాండ్‌పై భారత్‌ నాలుగు టెస్టుల సిరీస్‌ను 3–1తో నెగ్గింది. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచ్‌లు కూడా ఐదు రోజుల పాటు సాగకపోవడం భారత్‌ ఆధిపత్యాన్ని చూపుతోంది.

74.3 ఓవర్లపాటు సాగిన లంక రెండో ఇన్నింగ్స్‌ టీ విరామానికి కాస్త ముందు 181 పరుగుల వద్ద ముగిసింది. వికెట్‌ కీపర్‌ డిక్‌వెలా (52 బంతుల్లో 41; 5 ఫోర్లు), కెప్టెన్‌ చండిమాల్‌ (89 బంతుల్లో 36; 4 ఫోర్లు), మాజీ కెప్టెన్‌ మాథ్యూస్‌ (96 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించారు. స్పిన్నర్‌ అశ్విన్‌కు నాలుగు, షమీకి మూడు వికెట్లు దక్కాయి. హార్దిక్‌ పాండ్యాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... రెండు సెంచరీలతో అదరగొట్టిన శిఖర్‌ ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభమవుతుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక మూడో ఓవర్‌లోనే రెండో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో కరుణరత్నే (16) క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత షమీ ఎక్స్‌ట్రా బౌన్స్‌ బంతులతో విజృంభించి తన వరుస ఓవర్లలో పుష్పకుమార (1), కుశాల్‌ మెండిస్‌ (12)లను అవుట్‌ చేసి లంక పతనానికి బీజం వేశాడు. ఈ దశలో చండిమాల్, మాథ్యూస్‌ ఓర్పుగా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. ఎలాంటి భారీ షాట్‌లకు పోకుండా పూర్తి రక్షణాత్మకంగా ఆడి ఈ జోడి లంచ్‌ విరామానికి వెళ్లింది. దీంతో తొలి గంటలో మూడు వికెట్లు తీసిన భారత్‌ ఆ తర్వాత ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయింది.

లంచ్‌ బ్రేక్‌ తర్వాత పది ఓవర్ల పాటు లంక ఇన్నింగ్స్‌ సజావుగానే సాగింది. కానీ 51వ ఓవర్‌లో నిదానంగా కుదురుకుంటున్న ఈ సీనియర్‌ ఆటగాళ్ల జోడీని కుల్దీప్‌ విడదీశాడు. చండిమాల్‌ షార్ట్‌ లెగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను రహానే పట్టేయడంతో ఐదో వికెట్‌కు 65 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. మరో మూడు ఓవర్ల తర్వాత మాథ్యూస్‌ను అశ్విన్‌ ఎల్బీగా అవుట్‌ చేయడంతో లంక పోరాటం ఆశలు ఆవిరయ్యాయి. అటు డిక్‌వెలా కాస్త ధాటిగా ఆడినా మరో ఎండ్‌లో అతడికి సహకరించే వారు కరువయ్యారు. టెయిలెండర్లను అశ్విన్‌ చకచకా పెవిలియన్‌కు పంపడంతో పాటు డిక్‌వెలాను ఉమేశ్‌ యాదవ్‌ అవుట్‌ చేయడంతో రెండో సెషన్‌ ముగియక ముందే లంక వైట్‌వాష్‌కు గురైంది.

ఈ సిరీస్‌ ద్వారా టీమిండియాకు మేలు చేసిన అంశమేదైనా ఉంటే అది హార్దిక్‌ పాండ్యా జట్టులోకి రావడం. ఈ మూడు మ్యాచ్‌ల్లో అతను పరిణతి చెందిన విధానం ఆకట్టుకుంది. మంచి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ బంతితో పాటు బ్యాట్‌తోనూ చెలరేగి జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇది జట్టుకు మంచి సమతూకాన్ని ఇచ్చింది. యువకులతో కూడిన మా జట్టు ఇదే ఆటతీరుతో మున్ముందు సిరీస్‌లలో కూడా ఆడుతుంది. మరో ఐదారేళ్ల పాటు జట్టుకు ఆడగలిగే ఆటగాళ్లు ఉన్నారు.                  
–విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

1 విదేశీ గడ్డపై మూడు అంతకన్నా ఎక్కువ టెస్టు మ్యాచ్‌లతో నిర్వహించిన సిరీస్‌లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్‌ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి. ఇంటా బయట కలిపి ఓవరాల్‌గా ఐదోసారి.

1 తొలి ఇన్నింగ్స్‌లో మూడు సార్లు 300+ పరుగుల ఆధిక్యం సాధిండం భారత్‌కు ఇదే తొలిసారి.

9 శ్రీలంకలో భారత్‌ సాధించిన టెస్టు విజయాలు. ఇక్కడ మరే పర్యాటక జట్టు ఇన్ని విజయాలు సాధించలేదు.

2 విదేశీ గడ్డపై జరిగిన సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ అత్యధికంగా  ఐదు సెంచరీలు చేయడం ఇది రెండోసారి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

సెమీస్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ జట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’